ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈవీఎంల పరిశీలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజినీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుదారునికి చూపించనున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈ నెల 19 నుంచి 24 వరకు పరిశీలిస్తామన్నారు.
19 నుంచి ఒంగోలు ఈవీఎంల చెకింగ్..
