కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ

ecc.jpg

తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. నిన్నంతా ఈసీ అనుమతి కోసం వేచి చూసిన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు… అనుమతి రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఈరోజు ఈసీ అనుమతి లభించడంతో కాసేపట్లో కేబినెట్ భేటీ అవుతోంది. అయితే ఈ భేటీకి ఈసీ కొన్ని షరతులు విధించింది. కేవలం జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో… విద్యా సంస్థల్లో వసతులు, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ బ్యారేజ్ తదితర ప్రధాన అంశాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది. మరోవైపు, ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేసింది.

Share this post

scroll to top