మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేసినట్టు చెప్పుకొస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు రేపటి తో ముగియనుంది. కాబట్టి ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి అయింది.
మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగనున్న చర్చ..
