అల్లం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే అల్లంతో అందాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా అల్లంని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది. అల్లంని మనం రోజూ అనేక రకాలుగా వాడతాం. కూరల్లో వాడతాం. అల్లం టీ వాడతాం. ఇందులో గొప్ప గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా స్కాల్ప్‌ని హెల్దీగా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, మినరల్స్ అన్నీ కూడా స్కాల్ప్ ఇరిటేషన్‌ని దూరం చేసి జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. దానికోసం అల్లాన్ని ఎలా వాడాలంటే.
కావాల్సిన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ అల్లం పౌడర్
1 టేబుల్ స్పూన్ జొజొబా ఆయిల్
జొజొబా ఆయిల్, అల్లం పొడిని కలిపి పేస్టులా చేయాలి.
దీనిని తీసుకుని స్కాల్ప్‌పై అప్లై చేయాలి.
తర్వాత సర్క్యూలర్ మోషన్‌లో మసాజ్ చేయాలి.
30 నిమిషాల పాటు అలానే ఉంచండి.
ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేసి కండీషనర్ రాయండి. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.