2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూసిన జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా ఓటమి అనంతరం మొదటి సారి టీడీపీపై సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జగన్ తన ట్వీట్‌లో.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.
వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని దాడుచే చేస్తున్న వారిని అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ తన ట్వీట్ రాసుకొచ్చారు.