Tag Archives: jagan

ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ

ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ జరుగనుంది. విశాఖ జిల్లా భీమిలిలోని సంఘీవలసలో శనివారం భారీ బహిరంగసభ నిర్వహణకు వైసీపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గృహ సారధులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5-6వేల మంది చొప్పున దాదాపు 2 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా. ఇక అటు నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ...

Read More »

విశాఖలో జగన్‌ పర్యటన

జగన్‌ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా ...

Read More »

వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన జగన్‌

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను సిఎం జగన్‌ ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తికి సిఎం జగన్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

Read More »

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌  సమీక్ష

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Read More »

జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో ముఖ్యమంత్రితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ సమీర్ శర్మ ఉన్నారు. అనంతరం మువ్వన్నెల పథకాన్నిి ఆవిష్కరించిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.

Read More »

జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవోల సంఘం

దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందంలో మునిగితేలుతున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు.  

Read More »

జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

రక్షాబంధన్‌ సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు.

Read More »

హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శం : జగన్‌

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ఒక ప్రతీక అని ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు సిఎం జగన్‌ ఒక సందేశాన్ని విడుదల చేశారు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన హుస్సేన్‌ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.

Read More »

స్పీకర్‌ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జగన్‌

 శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

Read More »

గ్యాస్‌ లీక్‌పై జగన్‌ సీరియస్‌

అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకైన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ జరిపించాలని భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని తెలిపారు. మరోవైపు విషవాయువు లీకైన సెజ్‌లోని సీడ్స్‌ కంపెనీని మంత్రి అమర్నాథ్‌ పరిశీలించారు. ప్రమాదంపై నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని యాజమాన్యాన్ని ...

Read More »