ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేశ్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో..‘రషీద్ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు.. అనిల్ కుమార్ యాదవ్..
