రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు అన్ని ఫ్రీ అన్నారు.. ఇప్పుడేమో ప్రతిదానికి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు..
