ఏపీలో కూటమి ప్రభుత్వంలో హింస రోజురోజుకు పెరుగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. అలాగే, పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసిప్పటికీ వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎప్పుడూ ఇటువంటి ఘటనలు జరగలేదు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయి. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వ ప్రేరేపిత హింసలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల కళ్ల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కుట్రలతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయడం లేదు.
ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత హింస జరుగుతోంది..
