తన ఇంటి వద్ద జనసైనికులు చేసిన ఆందోళనపై పేర్ని నాని స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించారు. ఉడత ఊపులకు, బెదిరింపులకు బెదిరేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కులం లేదు, మతం లేదని హిందువులందర్నీ రెచ్చగొడుతూన్నారని ఆగ్రహించారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కల్యాణ్‌కు నోటికి వచ్చినట్టు ఇష్టాసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
తన వ్యాఖ్యలతో మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారాన్ని మీడియా సాక్షిగా ఎండగట్టానన్నారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆ బాధ్యతలు మరిచి ప్రవర్తించటం సిగ్గుమాలిన పని కాదా అంటూ ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తే ప్లాన్ ప్రకారం కార్యకర్తలను తన ఇంటి పైకి పంపారన్నారు. ఇలాంటి చర్యలకు తాను, వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడమన్నారు.