టీడీపీ కార్యకర్త చేసిన తప్పుకు నాపై కేసు పెట్టారు..

rajani-08.jpg

2019లో టీడీపీ కార్యకర్త చేసిన తప్పుకు నాపై కేసు పెట్టారని క్లారిటీ ఇచ్చారు విడదల రజనీ. తనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయంపై స్పందించారు రజనీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిందని అసత్య ప్రచారాలు,బూటకపు హామీల తో కూటమి అధికారం లోకి వచ్చిందని ఆగ్రహించారు మాజీ మంత్రి విడదల రజనీ. ఇప్పుడు హామీలు అమలు చేయలేం అని చేతులు ఎత్తేశారని మండిపడ్డారు.

ఒకవేళ సూపర్ సిక్స్ పథకాల పై ప్రశ్నిస్తే కేసులు పెడతారని తెలిపారు. చిలక లూరి పేట లో అరాచక పాలన సాగుతుందని ఫైర్ అయ్యారు. 2019 లో టిడిపి కార్యకర్త అసహ్యం గా కామెంట్స్ చేస్తే, పోలీసులు చర్యలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి విడదల రజనీ. అలా పోలీసు లు చర్యలు తీసుకున్న వ్యవహారానికి నాకు సంబంధం ఏంటి అంటూ నిలదీశారు. కోర్టు ఆర్డర్ ను,తప్పుగా ప్రచారం చేసి ,కోర్టు ఆర్డర్ ను తోసి పుచ్చి నా పై అక్రమ కేసు పెట్టించారన్నారు. అవాస్తవ కథలు అల్లి హై కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు మాజీ మంత్రి విడదల రజనీ.

Share this post

scroll to top