చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్‌ను తీసుకుని తన ఆఫీస్‌కి వెళ్లారు చంద్రకిశోర్. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని నమ్మించి ఇంటికి వెళ్లాడు చంద్రకిశోర్. ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన చంద్రకిశోర్ పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి హత్య ఆపై తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లింది తనూజ. కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించారు.
కాకినాడలో ఇద్దరు కొడుకుల్ని చంపి తండ్రి ఆత్మహత్య..
