విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్నిప్రమాదం..

vizag-23.jpg

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్- మిషన్ 2 లో మంటలు చెలరేగాయి. ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్లాంట్ లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పైప్ లైన్ దెబ్బ తినడం కారణంగా లీకేజ్ జరిగినట్టు గుర్తించారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. స్టీల్ ప్లాంట్ ఫైర్ డిపార్ట్మెంట్, రెస్క్యూ టీమ్స్ మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో సిబ్బంది పరుగులు తీశారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది జరగలేదని తెలిసింది.

Share this post

scroll to top