ఖమ్మం జిల్లాలోని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం చేస్తున్నారన్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో ముందస్తు హెచ్చరికలు చేసేవారని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే బాగుండేదని చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేవారని వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ మాకు కావాలన్నారు.
తాగడానికీ నీళ్లు లేవు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..
