ప్ర‌శ్నించిన పాపానికి ద‌ళిత యువ‌కుడిపై పోలీసుల దాష్టీకం..

bharath-4.jpg

కాకినాడ పోర్టు వివాదంపై మాజీ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపును జిల్లా కలెక్టర్ అడ్డుకున్న విషయం తెలిసిందే. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం రేషన్ బియ్యం తరలింపు వ్యవహారాన్ని పరిశీలించి సీరియస్ కావడంతో ఈ విషయం మరింత దుమారాన్ని రేపింది. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా స్పందించారు. కాకినాడ పోర్టు వివాదంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంలో నాలుగేళ్ల క్రితమే వాటాల బదలాయింపు జరిగినట్లు తెలిపారు.

కానీ ఇప్పుడు కేసులు పెట్టడాన్ని ఆయన తప్పు బట్టారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్‌ను సీజ్ చేయండని పవన్ కల్యాణ్ చెప్పారని, కానీ అక్రమ రవాణాపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది అంతా అక్రమేనని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వెనుకున్న కేవీరావుపై హైదరాబాద్‌లో కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేవీరావు వాటాలు ఐపీవో పరిధిలో ఉంటాయన్నారు. కేవీరావుపై ఎన్సీఎల్టీ, తెలంగాణ కోర్టుల్లోనూ కేసులు వేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు.

Share this post

scroll to top