గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 54 మంది విద్యార్థినులకు అస్వస్థత..

food-27.jpg

కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 54 మంది విద్యార్థినీలు అస్వస్థత కు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల పాఠశాలల్లో సమస్యలు అధికమవుతున్నాయి. సమస్యలతో విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధికారులను ఆదేశించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారమవ్వడం లేదు.

Share this post

scroll to top