ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో YCP అధినేత జగన్ పాల్గొంటారా? లేదా? అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అసెంబ్లీ స్పీకర్‌కు కూడా వినతిపత్రం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల జరిగిన సమావేశాల్లో MLAగా ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. వినుకొండ ఘటనపై సభలో ప్రభుత్వాన్ని YCP నిలదీస్తుందని నిన్న జగన్ చెప్పడంతో ఆయన వస్తారనే చర్చ నడుస్తోంది. ఒక వేళ వస్తే సభలో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కుతుందా? లేదా? అనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది.
జగన్ అసెంబ్లీ కి వస్తారనే చర్చ నడుస్తోంది.
