మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో భారీ ఊరట..

ramakrishna-05-1.jpg

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టు పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది. కండిషన్ బెయిల్ పై ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో భారీ ఊరట దక్కినట్లయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గత ఎన్నికల సమయంలో అనేక కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు నెల్లూరు జైలులో కూడా ఉండి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఆయన తనను విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని, తనుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనికి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది.

Share this post

scroll to top