జనసేన వైపు మాజీ మంత్రి..

raja-26.jpg

వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చూపు ఇప్పుడు జనసేన వైపు అంటూ ప్రచారం సాగుతోంది. దీంతో త్వరలోనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజావైసీపీకి రాజీనామా చేస్తారని ఆ తర్వాత జనసేనలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు దాడిశెట్టి రాజా తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తాను జనసేనలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, తన అభిమానులకు సూచించారు.

ప్రస్తుతం తాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌ లో ఉన్నానని త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటించారు. వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు నేను తునిలో లేని సమయంలో నేను జనసేన వైపు చూస్తున్నట్టు ఫేక్ న్యూస్‌ సృష్టించారు. ఆ ఫేక్‌ న్యూస్‌ మా పార్టీ నాయకులు, కార్యకర్తల మనస్సు నొప్పించాయి ఇలాంటి కథనాలతో అపోహలు కల్పించాలని చూస్తున్నారు. అయితే, మొదటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని న ఆ వెన్నంటే ఉండి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగానూ అధికారపక్షంలో మంత్రిగానూ నా ఉన్నతికి సహకరించిన మిమ్మల్ని గానీ మన నాయకులు జగన్మోహన్‌రెడ్డి గారిని కానీ నేడే వీడి వెలతానని ఎవ్వరు చెప్పినా నమ్మవద్దు.

Share this post

scroll to top