ద్వారంపూడిపై కక్ష సాధింపు చర్యలు నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఇదే సమయంలో చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని. మీ వల్ల 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు గత కొంతకాలంగా హాట్ టాపిక్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది. అక్రమ నిల్వలపై దాడి చేసి బయటపెట్టింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ కు దిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఈ మేరకు కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబుకు బహిరంగ లేఖ రాశారు గత వారం రోజులుగా ఎస్పీ, కలెక్టర్ కి ద్వారంపూడి పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కొండ బాబు. అంతేకాదు ఆయన అవినీతి పై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు.