తిరుమల శ్రీవారిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన స్పందించారు. నెయ్యి కల్తీ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కో మాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చాక రెండు నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. చంద్రబాబు హయాంలో వచ్చిన నెయ్యి కల్తీ జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ జరిగితే విచారణ జరిపి నిందితులను శిక్షించాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
శ్రీవారిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారు..
