మీరు తాగుతున్న టీ విషపూరితం అని మీకు తెలుసా..! క్యాన్సర్ కు వెల్కమ్ చెబుతున్నరంటూ హెచ్చరిక..

tea-12.jpg

టీ లేకుండా భారతీయుల రోజు ప్రారంభం కాదు. కొంతమంది రోజుని టీ తాగాడంతోనే ప్రారంభిస్తారు. మరికొందరికి టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఈ వ్యసనం కారణంగా ఆందోళన కూడా ప్రారంభమవుతుంది. టీ ప్రియులు తమకు ఇష్టమైన పానీయం తాగకుండా ఉండలేరు. అయితే ఈ టీ మనల్ని క్యాన్సర్ పేషెంట్‌గా కూడా మార్చగలదని మీకు తెలుసా..! కడుపు లేదా ఇతర సమస్యలకు టీ ప్రధాన కారణం అయినప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది టీకి బానిసలుగా మారి సమయానికి టీ తాగితే చాలు అన్నట్లుగా ఎదురుచూస్తారు. టీ తయారు చేస్తున్నప్పుడు దీనికి రంగులు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదికలో విషపూరితమైన టీని తయారుచేస్తున్నట్లు.. కర్ణాటకలో సేకరించిన టీ ఆకుల శాంపిల్స్ పరీక్షలో వెల్లడైందని పేర్కొన్నది.

Share this post

scroll to top