గ్రాండ్‏గా మెట్ గాలా ఈవెంట్ బేబీ బంప్‍తో కియారా..

kira-06.jpg

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025 న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో భాగం అయ్యారు. ఈసారి కొంతమంది సెలబ్రిటీలు మెట్ గాలా లో మొదటిసారిగా పాల్గొనబోతున్నారు, వారిలో కియారా అద్వానీ ఒకరు. గర్భవతి అయిన కియారా అద్వానీ మొదటిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో, తొలిసారి మెట్ గాలాలో కియారా మెరిసింది. అలాగే, ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసింది. సింగర్ దిల్జిత్ దోసాంజ్.. పంజాబీ స్టైల్ లో రాయల్టీని ప్రదర్శిస్తూ మెట్ గాలాలో మెరిశాడు. ఈ వేడుకలో పాల్గొన్న తారల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this post

scroll to top