గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ వచ్చేసింది..

charan-01.jpg

తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా.. ఫ్యాన్స్‌ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ కూడా చిత్ర నిర్మాణ సంస్థ పంచుకుంది. ఈ పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ లుంగీ కట్టి మాస్ లుక్‌లో అదరగొట్టారు. విలన్‌ను చరణ్ చితకబాది పట్టాలపై వేసి కూర్చుకున్నట్లు అనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయింది. మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా ఎస్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గేమ్‌ ఛేంజర్‌. గత నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్ అవుతోంది.

Share this post

scroll to top