హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర..

ganesh-15-.jpg

హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున గణేష్‌ నిమజ్జనం కొనసాగుతోంది. నగరం నాలుగు మూలల నుంచి గణనాథులు ట్యాంక్‌ బండ్‌ పైకి తరలి వస్తున్నాయి. దీంతో ఈరోజు ఉదయం హుస్సేన్‌ సాగర్‌ చుట్టు పక్కల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రేపు ఖైరతాబాద్ ‘మహా’గణపతి నిమజ్జనం ఉండనుంది. దీంతో నిన్న నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌ కు చేరుకుంటున్నాయి. అయితే, విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు పోలీసులు ఎవరూ లేరు. ట్యాంక్ బండ్ పైకి వచ్చిన వాహనాల్లో చాలా వరకు భారీ వాహనాలు ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. దారి పొడవునా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రతాపరంగా కొంత మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నప్పటికీ హుస్సేన్ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులెవరూ కనిపించకపోవడం గమనార్హం.

అయితే, రేపు ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగబోతుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. గణేశ్ శోభాయాత్ర భద్రత కోసం 25 వేల మంది సిబ్బందిని పోలీస్‌ శాఖ కేటాయించింది. ఇక, ఖైరతాబాద్‌ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర స్టార్ట్ చేయనున్నారు మధ్యాహ్నాం ఒటి గంటలోపు నిమజ్జనం చేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం వరకు నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Share this post

scroll to top