ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భారీ హామీలను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ హామీల అమలుపై పని చేస్తోంది. టీడీపీ కూటమి ప్రకటించిన హామీల్లో చాలానే కీలకమైనవి ఉన్నాయి. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. ఇప్పుడు అందరూ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పథకమే తెలంగాణలో కూడా అమలులో ఉంది. అయితే ఈ స్కీమ్ కింద ఉచితంగా సిలిండర్లు లభించవు. రూ. 500కే సిలిండర్ వస్తుంది. అంటే సిలిండర్‌పై దాదాపు రూ. 360 వరకు తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో మాత్రం ఉచితంగానే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి. చంద్ర బాబు కూటమి ఇప్పుడు ఈ స్కీమ్ అమలుపై పని చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకే ఈ స్కీమ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది?
