మహిళలకు గుడ్ న్యూస్. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి భారీ శుభవార్త. ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇకపై మీరు అధిక మొత్తాన్ని పొందొచ్చు. రుణ పరిమితి పెంపు ద్వారా చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. వీరికి చేయూత అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి రుణం పెంచడం వారికి వరంగా మారనుంది. స్త్రీనిధి రుణ పరిమితి రూ.10 వేల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో శ్రీకాకుళం జిల్లాలో 5.5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా బీమాతో పాటు రుణంలో 11 శాతం, వడ్డీలో 2 శాతం తిరిగి సభ్యులకు అందించడానికి వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రుణాల పెంపు వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. కాగా ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్రీనిధి రుణాల కింద రూ.170 కోట్లు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి 8,812 సంఘాలకు రూ.60 కోట్లకు పైగా అందజేశారు.
24 గంటల్లో డబ్బులు మహిళలకు బంపర్ బొనాంజా..
