రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ అందించింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు సంబంధించి అర్హత కలిగిన వారికి తీపికబురు అందించేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో అధికారులు ఇండ్లకు సంబంధించి డిజైన్‌పై కసరత్తు పెంచేశారు. ఇప్పటికే నాలుగైదు రకాల డిజైన్లు రెడీ చేసినట్టు తెలిసోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డిజైన్లపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అనుమతి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు తుది అనుమతులు రానున్నాయి. అంటే ఇంకొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఉంటాయో డిజైన్ తెలిసిపోనుంది.
ఇందిరమ్మ ఇండ్ల డిజైన్ రెడీ..
