అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరును క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్‌పై ఫోకస్ చేసిందట ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్న ఈ కార్పొరేషన్ లో ఇప్పటికే సగం మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా, మిగిలిన వారు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు మేయర్ స్రవంతి కూడా టీడీపీ గూటికి వచ్చేందుకు తహతహలాడుతుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రేకులు వేస్తున్నారని చెబుతున్నారు. మేయర్ వచ్చినా రాకున్నా నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు పడుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
హాట్ పాలిటిక్స్‌కు వేదికైన నెల్లూరులో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఫ్యాన్ పార్టీకి తిరుగులేని జిల్లాగా చెప్పే నెల్లూరులో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. సైకిల్ స్పీడ్ పెరగడంతోపాటు వైసీపీ అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దూకుడుతో కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగరేసేలా రంగం సిద్ధమవుతోందంటున్నారు.