పవన్ దూకుడు ఓ రకంగా హాట్ టాపిక్‌గా మారింది. పిఠాపురం సభలో ఆయన చేసిన కామెంట్స్ ఏకంగా సొంత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉన్నాయనే విమర్శలు తెరమీదకు వచ్చాయి. అయితే అధికారుల తీరు నచ్చకే పవన్ అలా మాట్లాడారట. ఏదైనా ఇష్యూపై మంత్రులు ఉన్నతాధికారులకు కాల్ చేస్తే కిందిస్థాయి అధికారులకు చెప్తామంటూ లైట్ తీసుకుంటున్నారట. ఇదే పవన్‌కు ఆగ్రహం తెప్పించిందని అందుకే ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారంటున్నారు. కూటమిలో కుంపటి లేదు పవన్‌లో అసంతృప్తి లేదు తన దృష్టికి వచ్చి ఆవేదన కలిగించిన అంశాలపైనే పవన్ మాట్లాడారని అంటున్నారు.
జనసేన అధినేత వరసగా రెండు సభలలో పాత జనసేనానిని గుర్తుకు వచ్చేలా బిగ్ సౌండ్ చేశారు. తొక్కి పట్టి నార తీస్తానంటూ ఏలూరు సభలో విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. ఇక లేటెస్ట్ గా పిఠాపురం సభలో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా పవన్ మాట్లాడినట్లు చర్చ జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ గర్జించిన తీరులో చాలా మ్యాటర్ ఉందని అంటున్నారు. తప్పు జరిగితే సొంత ప్రభుత్వం అయినా చూడను అన్న సంకేతాన్ని జనంలోకి పంపించినట్లు స్పష్టం అవుతోంది. సేమ్ టైమ్ అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలను, మంత్రులను అలర్ట్ చేసే ఉద్దేశం కూడా కనిపిస్తుందంటున్నారు.