విజయవాడకు అమావాస్య గండం వచ్చిపడిందని అంటున్నారు. అమావాస్య కారణంగా సముద్రం మంచి పోటు మీద ఉందని అంటున్నారు. సాధారణంగా వర్షం కారణంగా వరదలు వచ్చి చేరుతాయి. ఆ వరద నీటిని సముద్రం తనలోకి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరిగిపోతుందని సమాచారం.
విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ సిటీ ప్రజలకు రెండు రోజులుగా కంటిమీద కునుకులేకుండా పోయింది. సగానికి పైగా నగరం మొత్తం నీట మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నట్లు తెలుస్తుంది. రాత్రి 12 గంటల తర్వాత అమావాస్య గడియలు ముగిసిన తర్వాత సాధారణ స్థితికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.