కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. వారం నుంచి చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడతామంటున్నారని వాపోతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన మహిళలు దీనిని తీవ్రంగా ఖండిస్తూ న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ మాట్లాడుతూ మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు. ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఎస్పీ గారు ఏమి జరగలేదు అని అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఆడపిల్లలు ఎలా బయటకు వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు. అతను బయటకు రావాలి. ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా..
