సీసీ కెమెరాల వెనుక రాజకీయ నేత కుమార్తె..

clg-30.jpg

గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. లేడీస్ హాస్టల్‌ వాష్‌రూమ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి తండ్రి ప్రిన్సిపల్‌కు ఫోన్‌చేసి నా కూతురు పేరు బయటకు వస్తే డ్రగ్స్‌ కేసు పెట్టి కాలేజీ మూయిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటీషియన్‌తో కాలేజీ ప్రిన్సిపల్ కుమ్మక్కయి ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కాలేజీ పేరు బయటకు రావొద్దని డీల్ చేశారని కేసును సైలెంట్‌గా క్లోజ్‌ చేసే పనిలో కాలేజీ ప్రిన్సిపల్‌ ఉన్నారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు. తమను ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు వర్షంలో సైతం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

Share this post

scroll to top