దక్ష నాగర్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తెలుగులో హుషారు అనే సినిమాతో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన ‘జాంబీరెడ్డి’ ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. ఈ చిన్నది 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. రవి తేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో దక్ష నాగర్కర్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ బ్యూటీకి తెలుగు తీసిన సినిమాలకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా రావడం లేదు.
అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు లో చేసిన సినిమాలు తక్కువే అయిన.. తన హాట్ ఫోటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కుర్రకారుకు బాగా దగ్గర అయింది. తాజాగా శ్రీ విష్ణు హీరోగా నటించిన శ్వాగ్ సినిమా లో హీరోయిన్‌గా కీలక పాత్రను పోషించింది దక్షా నాగార్కర్. ఈ సినిమా అక్టోబర్ 04 విడుదలయింది.ఈ అమ్మడు అటు సోషల్ మీడియాలో తన అంద చందాలతో విందులు వడ్డించడం చాలా అలవాటు చేసుకుంది. ముఖ్యంగా తన ఫ్యాషన్ సిగ్నేచర్ తో అమ్మడు ఎప్పటి కప్పుడు అదరగొడుతోంది. వైట్ టాప్‌లో ఉన్న ఓ ఫోటోలో కొంటెగా చూస్తూ కేక పెట్టించింది.