వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించారు. అలాగే ఈ కేసులో పోసానిని సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఈలోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్..
