ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినబడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకులలో ప్రేమ కథలు తెరకెక్కించడంలో యువ దర్శకుడు హను రాఘవపూడి ది ప్రత్యేక శైలి. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ నుంచి పాన్ ఇండియా హిట్ ‘సీతా రామం’ వరకు ఆయన తీసిన ప్రతి ప్రేమ కథా చిత్రం, అందులో హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీని ఆయన తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీ..
