రేవంత్‌ రెడ్డికి హారీష్‌ రావు సవాల్..

harish-17.jpg

రైతు రుణ మాఫీ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్‌కు చురకలు వేస్తోంది. పూర్తి స్థాయిలో అర్హత కలిగిన వారికి రుణ మాఫీ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రూ.31 వేల కోట్లు అని చెప్పారని కానీ రుణ మాఫీకి రూ.17 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. రూ. 14 వేల కోట్లు కోత విధించారని పేర్కొన్నారు. రుణ మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు.

డిసెంబర్ 9 నాడే రుణ మాఫీ అన్నారని, కానీ ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని అన్నారని, కానీ ఇంకా పూర్తిగా సంపూర్ణంగా రైతు రుణ మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. రైతులను నిట్టనిలువులా ముంచారని వెల్లడించారు. ఏ ఊరుకైనా వెళ్లి రుణ మాఫీ జరిగిందా? చర్చ పెడతాం సిద్దమా అని సవాల్ అన్నారు. చర్చకు రెడీ అని, రుణ మాఫీ సంపూర్ణంగా అయ్యిందంటే నేను దేనికైనా సిద్ధమని వివరించారు. సీఎం రేవంత్ ఎక్కడకు చర్చకు రమ్మంటే అక్కడికి చర్చకు వస్తానన్నారు.

Share this post

scroll to top