ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..

harish-rao-22.jpg

కాంగ్రెస్ పార్టీ రైతుల ధాన్యం అమ్మకాలపై రివ్యూ చేయడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎక్కడెక్కడ తక్కువ మందు అమ్ముతున్నారు అని దానిపై మాత్రమే రివ్యూలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఎన్నికల ముందు బోనస్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానం అంతా బోగస్ గా మారి పోయిందని హరీష్ రావు సెటైర్స్ వేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ని సందర్శించారు. అక్కడ పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

Share this post

scroll to top