దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశ రాజకీయాల్లో హర్యానా కీలక పాత్ర పోషిస్తుంటుంది. పదేళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, పదేళ్ల కాలంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఈసారి హర్యానాలో మాదే అధికారమన్న ధీమా వ్యక్తమవుతోంది.
హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
