క్యాప్సికం దీనిని బెల్ పెప్పర్స్ లేదా స్వీట్ పెప్పర్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ రంగులలో లభ్యమయ్యే రుచికరమైన కూరగాయలు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. అవి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ వంటి వివిధ రంగులలో వస్తాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
క్యాప్సికం ఆరోగ్య ప్రయోజనాలు:
క్యాప్సికమ్ లో విటమిన్లు ఎ, సి, కె, అలాగే ఫైబర్, పొటాషియం, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, బలమైన ఎముకలు, మెరుగైన జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వీటితోపాటు క్యాప్సికమ్ లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. రెడ్ క్యాప్సికమ్ లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది. గ్రీన్ క్యాప్సికం అనేది కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీఆక్సిడెంట్లు అయిన ల్యూటిన్, జియాక్సాంటిన్ లకు మంచి మూలం. పసుపు, నారింజ క్యాప్సికమ్ లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన చర్మం, దృష్టికి మద్దతు ఇస్తుంది.