ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడన ప్రాంతం ఉండగా 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రల తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు అయితే, ఇది రుతుపవనాలు ముగింపు సీజన్‌లో ఆఖరి అల్పపీడనంగా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించారు అధికారులు.
బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి..
