రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు..

rain-10.jpg

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వర్షాలు అలాగే వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు అలాగే వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అల్లూరి జిల్లా కలెక్టర్ అధికారిక ప్రకటన చేశారు. అంతేకాదు వర్ష ప్రభావం ఉన్న ఏలూరు జిల్లా భీమడోలు, పెదపాడు మండపల్లి కైకలూరు ఏలూరు మదనపల్లి, కలిదిండి మండలాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువ ఉందో అక్కడ కచ్చితంగా పాఠశాలలను మూసివేస్తున్నారు.

Share this post

scroll to top