తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

havey-rain-24-.jpg

తేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు ఐఎండీ చెప్పింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తొంది. ఇది క్రమంగా తుఫాన్‌గా మారే అవకాశముందని అంచనా వేస్తోంది. అలాగే ఈనెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో గాలులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్‌లో 33.8, కనిష్టంగా నిజామాబాద్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలోని ఇవాళ అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది.

Share this post

scroll to top