తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు బలమైన ఈదురుగాలులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు..
