పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. 

hyd-11.jpg

ఒకవైపు సంక్రాంతి పండగ మరోవైపు శని, ఆదివారాలు కలిసిరావడంతో లక్షల మంది జనం సొంతూర్లకు క్యూకట్టారు. దాంతో, హైదరాబాద్‌ రోడ్లు స్తంభించిపోయాయ్‌. నగరం నలుమూలలా ఎటుచూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయ్‌. హైదరాబాద్‌ విజయవాడ హైవేపై పుల్‌ రష్‌ ఏర్పడింది. పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో, ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. హైదరాబాద్‌-విజయవాడ హైవే హెవీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్‌ స్లోగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైనా భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి.

Share this post

scroll to top