నిమ్మకాయలు ప్రతీ సీజన్‌లో దొరకవు. కొన్ని సీజన్‌లో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. అలాంటప్పుడు ఎక్కువగా తీసుకొచ్చి పెడతాం. అయితతే, కొన్ని రోజులకి అవి ఎండిపోతాయి. వీటిని అలా పారేస్తుంటారు.నిమ్మతో ఆరోగ్యానికి, అందానికి చాలా లాభాలున్నాయి. వీటిని ఎక్కువగా ఎండాకాలంలో డ్రింక్స్ చేసేందుకు వాడతారు. అందుకోసమే కాకుండా చర్మాన్ని, జుట్టుని కూడా కాపాడుకోవడంలో దీనిని వాడతారు. ఎండిన నిమ్మకాయల్లో పులుపు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి. వీటిని చారు, పులుసు, చేపలు, సూప్స్ చేసేటప్పుడు వాడొచ్చు. అయితే, అవి మొత్తం చెడిపోలేదని గుర్తించాకే వాడండి. కొన్నిసార్లు నోరు దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు నిమ్మ తొక్కల్ని మొత్తం రసం పిండేసి ఒక్కసారి దంతాలపై రుద్దండి. మరీ ఎక్కువ వద్దు.. ఒక్కసారి అలా రుద్ది వదిలేయండి. దీని వల్ల మరకలు తగ్గుతాయి. దంతాలు క్లీన్ అవుతాయి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలో ఈ నిమ్మరసం పిండండి. దీని వల్ల క్రిములు, మరకలు చాలా వరకూ పోతాయి. కాబట్టి, నిమ్మకాయల్ని పడేయకుండా ఇలా ఇంటిని క్లీన్ చేసేందుకు కూడా వాడొచ్చు. ఎండిన నిమ్మకాయల్ని కట్ చేసి గిన్నెల్లోని మొండి మరకల్ని రుద్ది వాటిని మెరిపించొచ్చు. కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఉప్పు వేసి నిమ్మరసం వేసి రుద్దితే చాలా వరకూ గిన్నెలపై ఉన్న జిడ్డు మరకలు, ఇతర మరకలు ఇట్టే వదిలిపోతాయి.
ఎండిన నిమ్మకాయలతో నోటి దుర్వాసనని పోగొట్టుకోండిలా..
