శ్రీకృష్ణుడి పాత్రలో నాని..

nani-31-.jpg

కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్‌ స్టార్‌’ నాని ననటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై నాని తాజాగా స్పందించారు. నాని తాజాగా ఓ జాతీయ మీడియా ప్రత్యేక చాట్‌లో పాల్గొన్నారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో శ్రీకృష్ణుడి పాత్రలో మిమ్మల్ని అభిమానులు చూస్తారా? అని నానిని అడగ్గా అసలు లేదని సమాధానం ఇచ్చారు. ‘సీక్వెల్‌లో కృష్ణుడి పాత్ర కంటే అర్జునుడు, కర్ణుడి పాత్రలే కీలకం. సీక్వెల్‌లో కృష్ణుడిని చూపించబోమని డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ చెప్పారు. అయినా నేను పార్ట్‌ 2లో ఉన్నట్లు రూమర్స్‌ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు. నేను కల్కి టీమ్‌తో కలిసి ఎక్కువసార్లు కనిపించడమే అందుకు కారణం కావొచ్చు. అతిథి పాత్ర గురించి నేను ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు. నేను ఏ సినిమాలోనూ అతిథి పాత్రలు చేయలేదు. కానీ కల్కి టీమ్‌తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని నాని తెలిపారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Share this post

scroll to top