ధూమ్ సినిమాలు అంటే పడిచచ్చిపోయే ఆ సిరీస్ నిర్మాత ఆదిత్య చోప్రా నాలుగో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిజానికి ఇది పాత విషయమే. మొన్నీమధ్యే సినిమాలో సూర్య ఈ సినిమాలో నటిస్తాడు అంటూ ఓ వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు సూర్య లేడు అంటున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బాలీవుడ్ స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. ‘ధూమ్’ సినిమాల గురించి మీకు తెలిసే ఉంటుంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేసిన చిత్రమిది. 2004లో రూపొందిన తొలి చిత్రానికి ఇప్పటికే రెండు సీక్వెల్స్ వచ్చాయి.
కానీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల విషయంలో ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. అలాగే సినిమాలో విలన్ స్థాయి కూడా పెరుగుతూ వచ్చింది. జాన్ అబ్రహం హృతిక్ రోషన్ ఆమిర్ ఖాన్ అంటూ స్టార్‌హీరోలనే ఎంచుకుంటూ వచ్చారు. తాజాగా నాలుగో ‘ధూమ్’ కోసం రణ్‌బీర్ కపూర్‌ను సంప్రదించారు అని సమాచారం. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రణ్‌బీర్‌కు 25వ చిత్రం అవుతుంది అని కూడా అంటున్నారు. మైల్ స్టోన్ మూవీ ధూమ్ 4 అయితే బాగుంటుంది అని ఆయన కూడా అనుకుంటున్నాడట. మరి నిజంగానే రణ్‌బీర్ ఓకే చేస్తాడా? లేక ఈ పుకారు పుకారుగానే మిగిలిపోతుందా అనేది చూడాలి. ఓకే అయితే మాత్రం ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ పక్కా.