కంగువాపై ముందు నుంచి ఒకే మాటపై ఉన్నారు సూర్య. తమిళ సినిమా తనకు ఎంతో ఇచ్చింది.. తాను కూడా తమిళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి ఇవ్వాలి. అదే కంగువా అంటున్నారీయన. కంగువాపై ఆయనకు అంత నమ్మకం ఏంటి నిజంగానే కంగువాతో సూర్య పాన్ ఇండియన్ మ్యాజిక్ చేస్తారా.? బాహుబలి, ట్రిపుల్ ఆర్ రేంజ్‌లో కంగువా ఉండబోతుందా పాన్ ఇండియన్ సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ నుంచే వస్తాయని అంతా నమ్ముతున్నారిప్పుడు. అప్పుడప్పుడూ కన్నడ నుంచి కేజియఫ్, కాంతారాలు మలయాళం నుంచి మంజుమ్మల్ బాయ్స్ లాంటి మూవీస్ వస్తున్నా. పాన్ ఇండియాలో అగ్ర తాంబూలం మాత్రం తెలుగు సినిమాలదే.
ఈ పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడా లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు. పొన్నియన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే కంగువాతో అసలైన పాన్ ఇండియన్ సినిమా ఇస్తానంటున్నారు సూర్య. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కల్కి, బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలను ఎలాగైతే ఆడియన్స్ గుర్తు పెట్టుకున్నారో కంగువాను అలాగే గుర్తిస్తారన్నారు సూర్య.