హైకోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కేడర్..

court-19.jpg

నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్యాలయాన్ని కూలిస్తే సహించేది లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నుంచి కార్యాలయంలోనే బస చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. బిల్డింగ్ దగ్గరే కాపలా కాస్తున్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుకు కూడా వెళతామని, కార్యాలయం కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. అయితే ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

Share this post

scroll to top